నెల్లూరులో కౌలు రైతుల ధర్నా

NLR: ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి తుళ్లూరు గోపాల్, ఆగస్టు 29న నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఈ ధర్నాలో కోరనున్నారు. ఆదివారం నగరంలోని జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు.