'సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా'
NLR: జిల్లాలోని కావలి రెవెన్యూ డివిజనల్ అధికారిగా డి.ఎలీషా నియమితులయ్యారు. ఆయన గురువారం సాయంత్రం పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు నెల్లూరులో కలెక్టర్ హిమాన్షు శుక్లా, డిప్యూటీ కలెక్టర్లను కలిశారు. అనంతరం బాధ్యతలు స్వీకరించి మాట్లాడారు. కావలి రెవెన్యూ డివిజన్‌లో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.