జిల్లా స్థాయి వూషూ పోటీలు ప్రారంభం

జిల్లా స్థాయి వూషూ పోటీలు ప్రారంభం

KRNL: విద్యార్థులు చదువుతో సమానంగా క్రీడల్లో రాణించినప్పుడే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. బుధవారం కర్నూలులో జిల్లా స్థాయి వూషూ పోటీలను ప్రారంభించారు. సమయాన్ని వృధా చేసుకోకుండా విద్యార్థులు తమకు నచ్చిన క్రీడల్లో సాధన చేయాలని సూచించారు. జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, క్రీడాకారులు పాల్గొన్నారు.