VIDEO: రైల్వే స్టేషన్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం
ఏలూరు రైల్వే స్టేషన్ సమీపంలోని వెంకటరమణ సామిల్ టింబర్ డిపోలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో చుట్టు పక్క ప్రజలు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. డిపోలో ఉన్న సుమారు 3 లారీల కలప, చెక్కలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు రూ.15 లక్షల ఆస్తి నష్టం జరిగింది.