బిలకల గూడూరులో శతాధిక వృద్ధుడు మృతి
KRNL: గడివేముల (M) బిలకలగూడూరు చెందిన శతాధిక వృద్ధుడు అబ్దుల్ ఖాదర్ (108) మంగళవారం మృతి చెందారు. ఐదు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ నేడు తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 108 ఏళ్ల సుదీర్ఘకాలం ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడం సామాన్య విషయం కాదని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఆయన మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.