ప్రారంభానికి ముస్తాబైన ఏకలవ్య మోడల్ స్కూల్
ASR: కొయ్యూరు మండలంలోని బాలారంలో నూతనంగా నిర్మించిన ఏకలవ్య మోడల్ పాఠశాల ప్రారంభానికి సిద్ధమైంది. ఈనెల 15న దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా ఈ పాఠశాలను ప్రారంభిస్తారని ప్రిన్సిపల్ డాక్టర్ సతీశ్ కుమార్ శుక్రవారం తెలిపారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇప్పటికే పాఠశాలకు విద్యుత్ దీపాలు అమర్చి ముస్తాబు చేశారు.