VIDEO: కరెంట్ షాక్‌కి 5 గేదెలు మృతి

VIDEO: కరెంట్ షాక్‌కి 5 గేదెలు మృతి

VZM: గజపతినగరం మండలంలోని చిట్టాయవలస గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం కరెంట్ షాక్ తగిలి 5 గేదెలు మృతి చెందాయి. లెంక శ్రీనివాస్‌కు చెందిన గేదెలను మేత కోసం పొలాలకు తీసుకువెళ్లారు. అక్కడ తెగిపడి ఉన్న హెచ్ టి వైర్లను తాకడంతో అక్కడికక్కడే మృతి చెందాయి. వాయుగుండం కారణంగా గురువారం మధ్యాహ్నం వీచిన గాలులకు వైర్లు తెగిపడి ఉండవచ్చని పలువురు భావిస్తున్నారు.