'సాధు తండాలో తప్పని నీటి కష్టాలు'

'సాధు తండాలో తప్పని నీటి కష్టాలు'

MDK: కంగ్టి మండల రాజారాం గ్రామ పంచాయతీలో ఉన్న సాధుతాండలో కొన్ని రోజుల నుండి నీటి సమస్య నెలకొంది. ఎండాకాలంలో నీటి సమస్య తీర్చాలంటూ గ్రామస్తులు వేడుకుంటున్నారు. అంతేకాక ఇంటి ఇంటికి నల్ల కనెక్షన్లు ఉన్నాయి. కానీ పైపుల్లో చెత్తా, చదారం, దుమ్ము, ధూళి, మట్టి ఇరుక్కోపోవడం వల్ల నీళ్లు రావడం లేదని వాపోయారు. దీంతో ప్రస్తుతం నీటి సమస్య ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.