ఈఈని సస్పెండ్ చేయాలి: ఎమ్మెల్యే
NDL: తెలుగుగంగ ఈఈ ప్రతాప్‌ను సస్పెండ్ చేయాలని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ డిమాండ్ చేశారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో రైతులు సాగు చేసిన పంటలకు చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తామని చెప్పి అధికారులు ఇంతవరకు నీటిని వదలలేదని ఎమ్మెల్యే తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు.