VIDEO: ఇసుక ర్యాంపును తలపించేలా సర్వీస్ రోడ్డు
SKLM: ఆమదాలవలసలోని రైల్వే గేట్ సమీపంలో రోడ్లన్నీ గుంతలతో అధ్వానంగా తయారయ్యాయని స్థానికులు అంటున్నారు. ఎక్కడికక్కడ పెద్దపెద్ద గుంతలు ఏర్పడడంతో, పైగా నిత్యం రద్దీగా ఉండే ప్రదేశం కావడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వారు తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించి, వెంటనే రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.