ఆఫర్ల పేరుతో వచ్చే సందేశాలు నమ్మవద్దు: ఏస్పీ

ఆఫర్ల పేరుతో వచ్చే సందేశాలు నమ్మవద్దు: ఏస్పీ

KRNL: ఇటీవల కాలంలో ఫేక్ లింకులు పంపించి సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదివారం తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండి సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా తమ కుటుంబ సభ్యులకు, పరిచయస్తులకు అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అత్యవసరమైతే 100ను సంప్రదించాలన్నారు.