ఎన్ని సార్లు చెప్పిన పట్టించుకొని అధికారులు

ఎన్ని సార్లు చెప్పిన పట్టించుకొని అధికారులు

VSP: ఆనందపురం మండలం ముచ్చెర్లలో మురుగు నీరు రోడ్డుపైనే ప్రవహిస్తూ చెత్తాచెదారంతో నిండిపోయింది. డ్రైన్ వాటర్ వల్ల అపరిశుభ్రత పెరిగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శికి, అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, తక్షణమే డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని ప్రజలు వేడుకుంటున్నారు.