'ఎర్ర బంగారం'.. డ్రోన్ విజువల్స్ వైరల్
AP: గుంటూరు జిల్లా మిర్చి సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. 'ప్రపంచ మిర్చి రాజధాని'గా పేరొందిన ఈ ప్రాంతంలో మిర్చిసాగు, కోత అనంతర దృశ్యాలను బంధించిన డ్రోన్ వీడియోలు నెటిజన్లను ముగ్ధులను చేస్తున్నాయి. ఆకాశం నుంచి చూస్తే భూమి అంతా ఎర్రటి దుప్పటి కప్పుకున్నట్లు కనిపిస్తున్న ఈ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.