పంచారామ దర్శనానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
SKLM: కార్తికమాసం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు జిల్లా ప్రజారవాణా అధికారి సీహెచ్. అప్పలనారాయణ శుక్రవారం తెలిపారు. అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటలకు ఈ బస్సులు అక్టోబర్ 26, నవంబర్ 2, 9, 16 తేదీల్లో పలాస, టెక్కలి, శ్రీకాకుళం డిపోల నుంచి సాయంత్రం 4 గంటలకు బయలుదేరతాయి.