హనుమంతునిపాడులో నేడు విద్యుత్ నిలిపివేత

ప్రకాశం: హనుమంతునిపాడు మండలంలో బుధవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ మణికంఠ ఓ ప్రకటనలో తెలిపారు. గ్రామంలో ఆర్ డి ఎస్ ఎస్ పనుల్లో భాగంగా నూతన లైన్లు, నూతన ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు వల్ల అంతరాయం ఉంటుందని ఆయన తెలియజేశారు. విద్యుత్ వినియోగదారులు అధికారులకు సహకరించాలని కోరారు.