VIDEO: సమస్యలకు నిలయంగా మారిన భీమడోలు బస్టాండ్

ELR: ద్వారకాతిరుమల క్షేత్రానికి ముఖద్వారమైన భీమడోలు జంక్షన్ బస్టాండ్ సమస్యలకు నిలయంగా మారింది. వర్షానికి బస్టాండ్ ఆవరణ భారీ గోతుల్లో నీరు చేరి బురదతో ఛిద్రంగా తయారవుతోంది. ద్వారకాతిరుమల క్షేత్రానికి వెళ్లడానికి, స్థానిక 30 గ్రామాలకు పాయింట్గా ఈ బస్టాండ్ ఉంది. RTC, DTL అధికారులు బస్టాండ్ అభివృద్ధికి కృషి చేయాలని ప్రయాణికులు, స్థానికులు కోరుతున్నారు.