మద్యం తాగి వాహనాలు నడిపిన వారికి జైలు శిక్ష
అన్నమయ్య: రాయచోటిలో మద్యం సేవించి వాహనాలు నడిపిన తొమ్మిది మందిపై న్యాయస్థానం కఠినంగా వ్యవహరించింది. జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ తేజస్విని గురువారం తీర్పు వెలువరించారు. వారిలో ఐదుగురికి మూడు రోజుల సాధారణ జైలు శిక్షను, నలుగురికి ఒక్కొక్కరికి రూ.11,000 చొప్పున జరిమానా విధించారు. మద్యం తాగి వాహనాలు నడపరాదని, రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని పోలీసులు హెచ్చరించారు.