గంజాయి సేవిస్తున్న మైనర్లకు కౌన్సిలింగ్

గంజాయి సేవిస్తున్న మైనర్లకు కౌన్సిలింగ్

అనకాపల్లి: గంజాయి సేవిస్తున్న ఇద్దరు మైనర్లకు ఆదివారం కౌన్సిలింగ్ నిర్వహించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎలమంచిలి రూరల్ ఎస్సై ఉపేంద్ర తెలిపారు. వీరిద్దరి వద్ద నుంచి 100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. గంజాయి, మాదకద్రవ్యాలతో పట్టుపడితే చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు.