భారీ వర్షాలతో ప్రజలను అప్రమత్తం చేయాలి: కలెక్టర్

భారీ వర్షాలతో ప్రజలను అప్రమత్తం చేయాలి: కలెక్టర్

SRD: జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులకు ఆదేశించారు. క్యాంపు కార్యాలయం నుంచి మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలు చెరువులు, కుంటల వైపు వెళ్లకుండా చూడాలని చెప్పారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని పేర్కొన్నారు.