చేబ్రోలులో పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత వైద్య శిబిరం

GNTR: చేబ్రోలులో సోమవారం నారాకోడూరు, తోట్లపాలెం, మంచాల, గుండవరం, గొడవర్రు, తదితర గ్రామాలకు చెందిన పారిశుద్ధ్య కార్మికులు, గ్రీన్ అంబాసిడర్లకు ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో వైద్యులు, సిబ్బంది పాల్గొని బీపీ, షుగర్ పరీక్షలు, టీటీ వ్యాక్సినేషన్ కార్యక్రమాలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.