ఉమ్మడి జిల్లాలో అడుగంటుతున్న భూగర్భ జలాలు
MBNR: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో వేసవి ఆరంభంలోనే ఎండలు నిప్పులు చెరుగుతున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో భూగర్భ జలమట్టం వేగంగా అడుగంటుతున్నాయి. మార్చి నెలలోనే పరిస్థితి ఇలా ఉంటే, ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని రైతాంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూగర్బ జలాల గురించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.