'యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి'
SRD: విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సంగారెడ్డి ట్రాఫిక్ ఎస్సై రాములు, సాయిలు అన్నారు. కొండాపూర్ మండలం మల్కాపూర్లో తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ శిబిరంలో సోమవారం సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. మత్తు పదార్థాలకు బానిసై జీవితాలు నాశనం చేసుకోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ నిర్మల పాల్గొన్నారు.