VIDEO: పోలీసులపై అసత్య ఆరోపణలు చేస్తే చర్యలు తప్పవు

ADB: పోలీసులపై సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు చేస్తే చట్ట రీత్యా చర్యలు తప్పవని టూ టౌన్ సీఐ నాగరాజు హెచ్చరించారు. కిడ్నాప్ కేసులో విచారణకు సహకరించకుండా సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలు చేసిన భగత్ విజయపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలీసులు మహిళల పట్ల గౌరవంగా వ్యవహరిస్తూ, బాధితులకు త్వరగా న్యాయం అందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.