యాదాద్రి దేవస్థానం నేటి ఆదాయ వివరాలు
యాదాద్రి: శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి శుక్రవారం సమకూరిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. ప్రసాద విక్రయాల ద్వారా రూ.6,02,100, కార్ పార్కింగ్ రూ.2,40,500, VIP దర్శనాలతో రూ.1,20,000, బ్రేక్ దర్శనాలతో రూ.1,41,600, ప్రధాన బుకింగ్ రూ.1,37,750, వ్రతాలతో రూ.1,32,000, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.18,02,681 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భవాని శంకర్ తెలిపారు.