'ఈ నెల 31వ తేదీ లోపు పన్నులు చెల్లించాలి'

'ఈ నెల 31వ తేదీ లోపు పన్నులు చెల్లించాలి'

కృష్ణా: మచిలీపట్నం నగరపాలక సంస్థ నూతన ప్రత్యేక పాలనాధికారిగా జిల్లా కలెక్టర్ బాలాజీ శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్నుపై ఉన్న వడ్డీని 50% రాయితీ కల్పించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన రాయితీని నగర ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని, ఈ నెల 31వ తేదీలోగా ఆస్తి పన్నులన్నీ చెల్లించాలని కోరారు.