VIDEO: విశాఖలో అగ్ని ప్రమాదం
VSP: మద్దిలపాలెం సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో గురువారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బిల్డింగ్ లోపల ఉన్న ఫర్నిచర్, ఇతర సామాగ్రి దగ్ధం అయింది. దీంతో చుట్టు ప్రక్కల దట్టమైన పొగ కమ్ముకున్నాయి. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.