ఆర్చరీ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో తెలుగమ్మాయి
ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్ పోటీల్లో తెలుగమ్మాయి వెన్నెం జ్యోతి సురేఖ పతకం ఖాయం చేసుకుంది. బంగ్లాదేశ్ ఢాకాలో జరుగుతున్న ఈ పోటీల్లో టీమ్ ఈవెంట్‌లో సురేఖ జట్టు బంగ్లాదేశ్‌ను సెమీస్‌లో ఓడించి ఫైనల్ చేరుకుంది. గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో సౌత్ కొరియాతో తలపడనుంది. మరోవైపు పురుషుల జట్టు కూడా ఫైనల్ చేరుకుంది.సౌత్ కొరియాతోనే తుదిపోరులో తలపడనుంది.