ఎమ్మెల్యేపై కేసు నమోదు

KRNL: అటవీ సిబ్బందిపై దాడి ఘటనలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, జనసేన నేత అశోక్‌పై కేసు నమోదైంది. శ్రీశైలం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో అటవీ శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు ఇరువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ ఘటన సీఎం చంద్రబాబు దృష్టికి చేరగా ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. పూర్తి నివేదిక ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు.