అందరి చూపు.. జగిత్యాల వైపే

అందరి చూపు.. జగిత్యాల వైపే

JGL: అందరి దృష్టి జగిత్యాల సభపై కేంద్రీకృతమైంది. ఈ నెల 20న బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నిర్వహించనున్న భారీ సభపై ఆసక్తి నెలకొంది. పోరాటాల నేలపై నుంచి గులాబీ బాస్‌, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి సమరశంఖం పూరించనుండగా, ఆయన ప్రసంగంలో ఏ అంశాలు ప్రస్తావిస్తారన్నదిపై చర్చ జోరుగా జరుగుతోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వ విధానాలపై ఎలా స్పందిస్తారన్నది కూడా ఉత్కంఠగా మారింది.