సివిల్స్ ప్రిపరేషన్.. సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్

సివిల్స్ ప్రిపరేషన్.. సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్

ADB: నార్నూర్ గ్రామ పంచాయితీ రాజకీయాల్లో నూతన ఒరవడి ప్రారంభమైంది. అగ్రికల్చర్ డిగ్రీ పూర్తి చేసి, సివిల్స్ కోసం సిద్ధమవుతున్న బానోత్ కావేరి సర్పంచ్ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. పుట్టిన గడ్డకు సేవ చేయాలనే లక్ష్యంతో ఆమె బరిలోకి దిగనున్నారు. మాజీ సర్పంచ్ బానోత్ గజానంద్ నాయక్ కుమార్తె అయిన కావేరి గ్రామస్తులతో కలిసి నామినేషన్ పత్రాలను సమర్పించారు.