గుజరాత్‌లో ప్రధాని మోదీ పర్యటన
ప్రధాని మోదీ ఈరోజు గుజరాత్‌లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12:45 గంటల ప్రాంతంలో నర్మద జిల్లాలోని దేవ్‌మోగ్రా ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం 2:45 గంటలకు దేడియాపడను సందర్శించి ధర్తీ ఆబా భగవాన్ బిర్సాముండా 150వ జయంతి వేడుకల్లో పాల్గొననున్నారు. అలాగే రూ.9,700 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు.