10న ఉద్యమకారుల మహాసభ.. విజయవంతం చేయండి: బీసీ జేఏసీ

10న ఉద్యమకారుల మహాసభ.. విజయవంతం చేయండి: బీసీ జేఏసీ

SRPT: తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమకారులకు వెంటనే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని బీసీ జేఏసీ జిల్లా కన్వీనర్ సైదులు డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. జనవరి 10న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగే ఉద్యమకారుల మహాసభకు సంపూర్ణ మద్దతు ప్రకటించారన్నారు. ప్రభుత్వం తన హామీలను నెరవేర్చకుంటే టీయూ జేఏసీతో కలిసి పోరాటాలు తప్పవన్నారు.