నిజాయితీ చాటుకున్న బాలుడు
NTR: కొత్తపేటలో 6వ తరగతి చదువుతున్న వెంకటేష్ అనే బాలుడు పాఠశాల నుంచి వస్తుండగా దొరికిన రూ.14 వేలు, ఐడీ కార్డుతో కూడిన పర్సును సోమవారం కొత్తపేట పోలీస్ స్టేషన్‌లో సీఐ చిన కొండలరావుకు అప్పగించాడు. బాలుడి నిజాయితీకి మెచ్చి, బాధితురాలు సూర కమలకుమారి అతనికి రూ.500 బహుమతిగా ఇవ్వబోగా, బాలుడు తీసుకోలేదు. పోలీసు సిబ్బంది కూడా బాలుడి నిజాయితీని ప్రశంసించారు.