దసరా ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష

PPM: పాలకొండ పట్టణంలో శ్రీ కోటదుర్గ అమ్మవారి దసరా ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులు శుక్రవారం సమీక్షించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జయకృష్ణ హాజరయ్యారు. ఈనెల 22వ తేదీ నుంచి జరగనున్న దసరా ఉత్సవాల ఏర్పాట్లపై డీఎస్పీ, ఆలయ ఈవో ఉత్సవాల స్థలాన్ని పరిశీలించారు. అమ్మవారి దర్శనానికి వచ్చి, వెళ్లే భక్తులకు ఇబ్బంది లేకుండా మార్గాలను నిర్దేశించారు.