చెన్నై పోలీసుల 'హార్ట్' టచ్ ప్లాన్!

చెన్నై పోలీసుల 'హార్ట్' టచ్ ప్లాన్!

చెన్నైలో ట్రాఫిక్ పోలీసులు 'జీరో యాక్సిడెంట్ డే' పేరుతో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. రెడ్ సిగ్నల్ లైట్లపై 'హార్ట్ సింబల్' స్టిక్కర్లు అతికించి.. 'మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం.. సిగ్నల్స్‌ను గౌరవించండి' అనే మెసేజ్ ఇస్తున్నారు. ప్రమాదాలను ఆపడమే దీని లక్ష్యం. కాలేజీలు, స్కూళ్లలో కూడా దీనిపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ ఐడియాకు మంచి రెస్పాన్స్ వస్తోంది.