ఘనంగా ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ

ELR: లింగపాలెం మండలం అన్నపనేనివారిగూడెంలో రూ. 10 లక్షలకు పైగా ఖర్చుతో నందమూరి తారక రామారావు విగ్రహాన్ని బొల్లినేని సత్యనారాయణ శైలజ దంపతులు ఏర్పాటు చేశారు. సోమవారం టీడీపీ నేతలు ఘనంగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోషన్, ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు, మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ పీతల సుజాత పాల్గొన్నారు.