టీడీపీ నుండి వైసీపీలోకి చేరికలు

టీడీపీ నుండి వైసీపీలోకి చేరికలు

పల్నాడు: సత్తెనపల్లి మండల పరిధిలోని కొమెరపూడి గ్రామంలో టీడీపీ పార్టీకి ఊహించిన షాక్ తగిలింది. టీడీపీ పార్టీని వీడి 35మంది కార్యకర్తలు పట్టణ స్థానిక పార్టీ కార్యాలయంలో మంత్రి అంబటి రాంబాబు సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి అంబటి రాంబాబు వారికి స్వయంగా పార్టీ కండువాలను కప్పి సాదరంగా ఆహ్వానించారు.