ఆదివారాల్లోనూ విద్యార్థులకు భోజనం

CTR: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు ప్రతి ఆదివారం మధ్యాహ్న భోజనం పెట్టాలని డీఈఓ వరలక్ష్మి వెల్లడించారు. రాష్ట్ర విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు పదో తరగతి పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టాలన్నారు. ఉత్తమ ఫలితాల కోసం విద్యార్థులకు 100 రోజుల కార్యక్రమం అమలు చేస్తున్నామని తెలిపారు.