ఆంజనేయస్వామికి పంచామృత అభిషేకం

సూర్యాపేట: హుజూర్ నగర్ మండలం బూరుగడ్డ గ్రామంలో శ్రీ ఆదివరాహ లక్ష్మీనరసింహ వేణుగోపాల స్వామి దివ్య క్షేత్రంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి ఆంజనేయ స్వామికి పంచామృత అభిషేకం, 108 తమలపాకులతో ఆకుపూజ, గంధ సింధూరం లేపనం పూసి పువ్వులతో ప్రత్యేకంగా అలంకరించి, పూజాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ప్రసాద వితరణ చేశారు.