రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదు
WNP: జిల్లాలో భానుడు భగభగడుతూ ఎండలు దంచికొడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా రికార్డు స్థాయిలో రేవల్లి మండల కేంద్రంలో 42.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. వీపనగండ్ల 42.7°C, దగడ 42.6°C, ఎదుల, శ్రీరంగాపూర్ 42.5°C, వెలుగొండ 43.3°C, పెద్దమందడి 42.9°C, అమరచింత, గోపాల్ పేట 41.7°C, వనపర్తి, పెబ్బేరు, ఆత్మకూరు 41.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.