VIDEO: వల్లభుల స్వామి వెండిరథం ప్రాకరోత్సవం

సత్యసాయి: కదిరి శ్రీదేవి, భూదేవి సమేత వసంత వల్లభుల స్వామి వెండిరథం ఆలయ ప్రాకరోత్సవం మంగళవారం రాత్రి భక్తి శ్రద్ధలతో జరిగింది. స్వామిని సుగంధ పుష్పాలు, మల్లెలు, తులసి మాలతో అలంకరించి, అస్థాన పూజలు, మేళాలు నిర్వహించి, కేసరి బాత్, పండ్లు నైవేద్యంగా సమర్పించి ప్రసాదాన్ని భక్తులకు అందించగా, భక్తులు స్వామిని దర్శించి ఆనందభరితులయ్యారు.