VIDEO: పాణ్యంలో గంజాయి విక్రేతల అరెస్ట్
NDL: పాణ్యం పట్టణ సమీపంలోని స్టీల్ ప్లాంట్ వద్ద గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 2Kgల గంజాయి, 3 సెల్‌ఫోన్లు, పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నట్లు CI కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. SP సునీల్ షొరాణ్ ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాలు, గంజాయిపై గట్టి నిఘా ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో SI నరేంద్ర, PSI ధనుంజయ ఉన్నారు.