సీఎంఆర్‌ఎఫ్ పేదల సంజీవని
SRPT: సీఎంఆర్‌ఎఫ్ పేద ప్రజల సంజీవని అని హుజూర్‌నగర్ మాజీ మున్సిపల్ ఛైర్మన్ దొంతగాని శ్రీనివాస్ అన్నారు. గురువారం పట్టణానికి చెందిన దొంతగాని సోమయ్య గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ, ఇటీవల హాస్పిటల్‌లో వైద్య చికిత్స చేయించుకుని ఆర్థిక ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో, సీఎంఆర్‌ఎఫ్ నుంచి మంజూరైన 60వేల రూపాయల చెక్కును బాధిత కుటుంబానికి అందజేసి మాట్లాడారు.