శ్రీ పరశురామేశ్వస్వామి ఆలయంలో అంకురార్పణ

శ్రీ పరశురామేశ్వస్వామి ఆలయంలో అంకురార్పణ

TPT: గుడిమల్లం శ్రీ పరశురామేశ్వస్వామి ఆలయంలో మహాకుంభాబిషేకానికి ఆదివారం వైభవంగా అంకురార్పణ పూజలు చేపట్టారు. ఆలయ ప్రధాన అర్చకులు వంశీకృష్ణశర్మ, యోగేంద్ర పవ న్కుమార్ శర్మ ఆధ్వర్యంలో మొదటి గ్రామదేవత శ్రీ ఏకారమ్మదేవికి సారె సమర్పించి ఆజ్ఞ పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తల్లి బృందమ్మ ఆలయానికి అందజేసిన గోపుర కలశాలను, పూజాసామగ్రిని ఉత్సవంగా యాగశాల వద్దకు తీసుకొచ్చారు.