విద్యను బోధించిన జిల్లా కలెక్టర్

కురుపాం మండలం పర్యటనలో భాగంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మంగళవారం ఉదయపురం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. పాఠశాల ఆవరణ, కిచెన్ గార్డెన్, డార్మెంటరీ, క్లాస్ రూమ్స్‌ని తనిఖీ చేశారు. అలాగే ఉపాధ్యాయ అవతారమెత్తి విద్యార్థులకు లెక్కలను బోధించి వారిలో విద్యా సామర్ధ్యాలను పరిశీలించారు. ఉపాధ్యాయులు బోధించే విషయాలను క్రమశిక్షణతో నేర్చుకోవాలి అన్నారు.