విజయవాడ దుర్గగుడిలో భారీ మోసానికి యత్నం
NTR: విజయవాడ దుర్గగుడిలో ఓ వ్యక్తి భారీ మోసానికి పాల్పడ్డ ఘటన సంచలనంగా మారింది. నకిలీ పత్రాలు సృష్టించి ఓ వ్యక్తి అర్చకుడిగా ఆలయంలోకి ప్రవేశించేందుకు యత్నించాడు. దిలీప్ అనే వ్యక్తి 2022లో మృతి చెందిన సాయిబాబు అనే అర్చకుడి స్థానాన్ని భర్తీ చేసేందుకు ప్రయత్నించాడు. ఆలయంలోనే ఇలాంటి మోసం జరగడంతో దేవాదాయ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ప్రక్రియపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.