ఉరేసుకుని ఉపాధ్యాయురాలి మృతి
MBNR: వనపర్తిలోని న్యూటౌన్ కాలనీకి చెందిన ఉపాధ్యాయురాలు రాకాసి శ్రీదేవి తన నివాసంలో ఉరివేసుకొని మృతి చెందినట్లు పట్టణ పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. మృతురాలు కొన్ని రోజులుగా మానసిక రోగంతో బాధపడుతుందని భర్త, పిల్లలు ఇంట్లో లేని సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.