'మరో జిల్లాలో కలిపే ప్రయత్నం చేయొద్దు'

'మరో జిల్లాలో కలిపే ప్రయత్నం చేయొద్దు'

NLR: సర్వేపల్లి నియోజకవర్గం ఉండేలా చూడాలని, మరో జిల్లాలో కలిపే ప్రయత్నం చేయొద్దని ఎమ్మెల్యే సోమిరెడ్డి కోరారు. బుధవారం జిల్లాల పునర్విభజనపై ఏర్పడిన మంత్రివర్గ ఉపసంఘానికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లేఖ రాస్తూ.. కందుకూరును ప్రకాశంలో కలిపితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ సర్వేపల్లిని మాత్రం వేరే జిల్లాలో కలప వద్దని పేర్కొన్నారు.