ఈనెల 27న ఎరువుల సమస్యలపై సంపూర్ణ బంద్
KMR: తెలంగాణ ఫెర్టిలైజర్స్ ఆగ్రో ఇన్పుట్ డీలర్స్ అసోసియేషన్ పిట్లం ఆధ్వర్యంలో ఏప్రిల్ 27, 2026న ఒక్కరోజు సంపూర్ణ బంద్ నిర్వహించనున్నట్లు సభ్యులు ప్రకటించారు. మహారాష్ట్ర స్టేట్ అగ్రి ఇన్పుట్స్ డీలర్స్ అసోసియేషన్ చేపట్టిన నిరవధిక బంద్‌కు సంఘీభావంగా, ఆల్ ఇండియా అసోసియేషన్ పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.