చోరీలు చేస్తున్న ఐదుగురు అరెస్ట్

చోరీలు చేస్తున్న ఐదుగురు అరెస్ట్

KKD: జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్‌ల పరిధిలో మోటార్ సైకిళ్లతో పాటు ఇళ్లలో చోరీకి పాల్పడుతున్న ఐదుగురు నిందితులను ఆయా పోలీస్ స్టేషన్‌ల పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 25.3 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, రూ.95 వేల నగదు, 6 మోటర్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఇవాళ వివరాలు వెల్లడించారు.